Rahul Gandhi: ఆగస్టులో మరోసారి తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ..?
*వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరి.. ఈసారి విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్
ఆగస్టులో మరోసారి తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ..?
Rahul Gandhi: ఆపరేషన్ ఆగస్టుపై తెలంగాణ కాంగ్రెస్ కన్నేసింది. ఆగస్టులో మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన.. సిరిసిల్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరి ఈసారి విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో పీసీసీ చీఫ్ రేవంత్ మంతనాలు జరిపినట్లు సమాచారం. బీజేపీ విజయ సంకల్ప సభకు మించి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు టీపీసీసీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురుదాడే లక్ష్యంగా సిరిసిల్ల సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Next Story




