తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది.

Arun Chilukuri
Updated on: 14 April 2022 3:00 PM IST
Rahul Gandhi Telangana Tour Finalized
X

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది. మే మొదటివారంలో తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు. మే 4న వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మే 5న బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో రాహుల్‌ భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణలో రాహుల్‌ పర్యటనతో ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్‌ నెలకొంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ ఛైర్మన్లతో సమావేశమై కీలక సూచనలు చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story