రేవంత్‌, రాహుల్‌ మధ్య రన్నింగ్‌ రేస్‌.. పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్ నింపుతున్న రాహుల్‌

*మహబూబ్‌నగర్‌లో రాహుల్‌ పాదయాత్ర

Rama Rao
Published on: 30 Oct 2022 2:02 PM IST
Rahul Gandhi Sprints during Bharat Jodo Yatra in Telangana
X

రేవంత్‌, రాహుల్‌ మధ్య రన్నింగ్‌ రేస్‌.. పార్టీ శ్రేణుల్లో ఫుల్‌ జోష్ నింపుతున్న రాహుల్‌

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌లో రాహుల్‌ పాదయాత్రలో భాగంగా.. అక్కడున్న పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. యాత్రలో నడుస్తున్న రాహుల్‌ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. అయితే.. వారితో కలిసి రన్నింగ్‌ మొదలుపెట్టారు రాహుల్. పక్కనే ఉన్న రేవంత్‌ కూడా పరుగు అందుకున్నారు. అక్కడున్నవాళ్లు దీన్ని చూసి కేరింతలు కొట్టారు. ‎

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బతుకమ్మ ఆడి అక్కడి వారిని అబ్బురపరిచారు. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన బతుకమ్మ ప్రదర్శనను రాహుల్ గాంధీ ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత మహిళలతో కలిసి లయబద్ధంగా అడుగులు కలుపుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడి అందరిని అబ్బుర పరిచారు.

రాహుల్ గాంధీతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ మల్లు రవి బతుకమ్మ ఆట ఆడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయమైన బతుకమ్మ పండుగలో దసరా పండుగ ముందు తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని మూడు కోట్ల మంది మమేకమవుతారని, తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకొంటారని భట్టి విక్రమార్క బతుకమ్మ విశిష్టత గురించి రాహుల్ గాంధీకి వివరించారు.

Rama Rao

Rama Rao

Next Story