Rahul Gandhi: ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌కు రాహుల్ నివాళులు.. ట్వీట్ పై స్పందించిన షర్మిల

YS.Sharmila: మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్ నమ్మారు

Shekhar G
Published on: 8 July 2023 4:37 PM IST
Rahul Gandhi Pays Tribute To YSR Through Twitter
X

Rahul Gandhi: ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌కు రాహుల్ నివాళులు.. ట్వీట్ పై స్పందించిన షర్మిల

Rahul Gandhi: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర‌్భంగా..పలువురు నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌‌కు నివాళులర్పించారు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడని.. ఆయన ఎల్లప్పుడూ స్మరించబడాలంటూ రాహుల్ ట్వీట్ చేశారు. తాజాగా.. రాహుల్ ట్వీట్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు రాహుల్ గాంధీజీ అంటూ షర్మిల రిప్లై ఇచ్చారు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి... మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్ అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.



Shekhar G

Shekhar G

Next Story