ఒకరోజు ముందుగానే తెలంగాణకు రాహుల్ జోడో యాత్ర

Rahul Gandhi: 15 రోజులపాటు తెలంగాణలో కొనసాగనున్న యాత్ర

Jyothi
Published on: 9 Oct 2022 1:43 PM IST
Rahul Gandhi Jodo Yatra to Telangana a Day Earlier
X

ఒకరోజు ముందుగానే తెలంగాణకు రాహుల్ జోడో యాత్ర

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ఒకరోజు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉంది. మొదట నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 24న మక్తల్ లో ప్రవేశించాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 23నే మక్తల్ కు చేరుకోనుంది. దీపావళి పండుగ నేపథ‌్యంలో 24. 25 తేదీల్లో పాదయాత్రకు విరామం ఉంటుంది. రాహుల్ గాంధీ దీపావళి పండుగను తెలంగాణలోనే జరుపుకోనున్నారు. దీపావళి తర్వాత 26న తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది. జుక్కల్ నియోజకవర్గంలో ముగియనున్న పాదయాత్ర 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ మార్పును పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో యాత్రపై చర్చించారు.

Jyothi

Jyothi

Next Story