మక్తల్‌ నుంచి తిరిగి ప్రారంభమైన రాహుల్‌గాంధీ పాదయాత్ర.. పాల్గొన్న రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ

*ఇవాళ 26.7 కి.మీ. కొనసాగనున్న రాహుల్‌ పాదయాత్ర.. దండు, కాచ్వార్‌ మీదుగా బొందలకుంట వరకు యాత్ర

Jyothi
Updated on: 27 Oct 2022 1:27 PM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Telangana
X

మక్తల్‌ నుంచి తిరిగి ప్రారంభమైన రాహుల్‌గాంధీ పాదయాత్ర.. పాల్గొన్న రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ

Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ పాల్గొన్నారు. ఇవాళ దాదాపు 26 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. దండు, కాచ్వార్ మీదుగా బొందలకుంట వరకు యాత్ర కొనసాగనుంది. భోజన విరామం తరువాత రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుకోనున్నారు. అనంతరం సామాజిక వేత్తలతో రాహుల్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభం కానుంది. జక్లేర్ మీదుగా గుడిగంట్లకు రాహుల్ పాదయాత్ర చేరుకోనుంది. నేతలతో సమావేశం తరువాత రాహుల్ గాంధీ గుడిగంట్లలో రాత్రికి బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story