తెలంగాణలో మూడో రోజు ప్రారంభమైన భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: ఎలిగండ్ల నుంచి యాత్ర ప్రారంభం

Jyothi
Published on: 28 Oct 2022 8:33 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra Enters 3rd Day in Telangana
X

తెలంగాణలో మూడో రోజు ప్రారంభమైన భారత్ జోడోయాత్ర  

Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర మూడో రోజు మొదలైంది. నారాయణపేట్‌ జిల్లా ఎలిగండ్లనుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జోడో యాత్ర జెండా ఆవిష్కరించారు. రాహుల్‌తో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఎలిగండ్ల సందడిగా మారింది. ఎలిగండ్లనుంచి ప్రారంభమైన ఈ యాత్ర మరికల్ , పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా సాగుతుంది. మార్గ మధ్యలో గోపాల్‌ పూర్‌లో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. మన్యంకొండ వద్ద సభ నిర్వహిస్తారు. ఇవాళ 23 కిలోమీటర్ల 300 మీటర్ల మేర యాత్ర సాగుతుంది. ధర్మాపూర్‌లో రాత్రి బస చేసే విధంగా సన్నాహాలు పూర్తి చేశారు.

Jyothi

Jyothi

Next Story