Lok Sabha Elections: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ఖరారు

Lok Sabha Elections: ఈ నెల 5, 9 తేదీల్లో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 May 2024 1:41 PM IST
Rahul Gandhi And Priyanka Gandhi Telangana Tour Confirmed
X

Lok Sabha Elections: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ఖరారు

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 5, 9వ తేదీల్లో రాహుల్‌గాంధీ.. 6, 7 తేదీల్లో ప్రియాంకగాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 5న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్‌లో ఉదయం 11 గంటలకు జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. సాయంత్రం నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని గద్వాల్‌లో జరిగే సభలో పాల్గొంటారు.

రాహుల్ పర్యటన ముగిసిన తర్వాత రోజే ప్రియాంక పర్యటించనున్నారు. ఈ నెల 6న ఎల్లారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తాండూర్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం 7వ తేదీన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మే 9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు రాహుల్‌గాంధీ. కరీంనగర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story