Raghunath Yadav: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రజల కష్టాలను దూరం చేస్తాం

Raghunath Yadav: ఆల్విన్ కాలనీ, పీజేఆర్ నగర్‌లో రఘునాథ్ యాదవ్ పర్యటన

Jyothi
Published on: 2 Sept 2023 8:01 AM IST
Raghunath Yadav visit to Allwyn Colony PJR Nagar
X

Raghunath Yadav: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రజల కష్టాలను దూరం చేస్తాం

Raghunath Yadav: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ప్రజల కష్టాలను దూరం చేస్తుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆయన గడపగడపకు కాంగ్రెస్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ గురుగోవింద్ సింగ్ నగర్, పీజేఆర్ నగర్‌లలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, రాహుల్ గాంధీ ఆశయాలను, ప్రతి ఒక్కరికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించి సుపరిపాలన అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారని, వర్షాకాలం వస్తే బస్తీలలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story