ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!

X
Highlights
దుబ్బాక ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.
Krishna15 Nov 2020 11:16 AM GMT
దుబ్బాక ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు స్పీకర్ ఛాంబర్‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఇటివల వెలువడిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో రఘునందన్ రావు సంచలన విజయం సాధించి మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే... 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పైన విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.
Web TitleRaghunandan Rao's swearing in as MLA on this month 18th
Next Story