దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రఘునందన్ రావు

X
Highlights
దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు....
Arun Chilukuri18 Nov 2020 11:03 AM GMT
దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డి రఘునందన్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం రఘునందన్ రావుకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
Web TitleRaghunandan Rao Takes Oath As Dubbaka MLA
Next Story