Raghunandan Rao: లిక్కర్ దందాచేసి తెలంగాణకు రుద్దడమేంటి?
Raghunandan Rao: అక్రమ సంపాదనకోసం తప్పటడుగులేసి ఆడపడుచులకు రుద్దడం బాధాకరం
Raghunandan Rao: లిక్కర్ దందాచేసి తెలంగాణకు రుద్దడమేంటి?
Raghunandan Rao: అడ్డదారిన ఎమ్మెల్సీ అయిన కవిత చేసిన తప్పును తెలంగాణ ఆడపడుచులకు రుద్దడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ నోటీసులు జారీకావడం, కవిత వెల్లడించిన అభిప్రాయంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు విచారం వ్యక్తంచేశారు. అదనపు ఆదాయంకోసం అక్రమార్గాల్లో అడుగులేసి, అవినీతికి పాల్పడిన తర్వాత ఈడీ నోటీసులిస్తే... తెలంగాణ సమాజాన్ని మధ్యలోకి తీసుకురావడాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story




