Raghunandan Rao: సుఖేష్ చెప్పిన కారు ఎవరిదో ఉన్నతాధికారులు చెప్పాలి

Raghunandan Meet the officials of ED and EC the Release of Sukesh Chatting
x

Raghunandan Rao: సుఖేష్ చెప్పిన కారు ఎవరిదో ఉన్నతాధికారులు చెప్పాలి

Highlights

Raghunandan Rao: మనీ లాండరింగ్ కింద విచారణ జరపాలని ఈడీని కోరాం

Raghunandan Rao: ఇక సుఖేష్ లేఖలు విడుదల చేసిన నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించారు. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఇక తెలంగాణ భవన్‌కు డబ్బులు చేరాయని లేఖలో పేర్కొనడంతో.. ఈ విషయంలో విచారణ జరపాలని ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. రాజకీయ కార్యకలాపాలు జరగాల్సిన ఆఫీస్‌లో డబ్బులు చేతులు మారాయన్న ఆయన.. మనీ లాండరింగ్ కింద విచారణ జరపాలన్నారు.

ఐదు దఫాలుగా 15 కోట్ల రూపాయలు బీఆర్ఎస్‌ కార్యాలయానికి వచ్చాయని సుఖేష్ చెప్పాడన్న రఘునందన్.. అబద్ధం అయితే ఇప్పటివరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుఖేష‌ చెప్పిన కారు ఎవరిదో ఉన్నతాధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories