Ragging: యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం

Ragging: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 11:43 AM IST
Ragging: యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం
X

Ragging: యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం

Ragging: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 10వ తరగతి ఆరుగురు విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో జూనియర్ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులం వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటికే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌, యాజమాన్యం ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story