Hyderabad: పోకిరిల ఆట కట్టించిన షీటీమ్స్‌.. 15 రోజుల్లో 108 మంది జైలుకి..

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో షీటిమ్స్‌ పోకిరిల ఆట కట్టించింది.

Arun Chilukuri
Published on: 6 Feb 2024 4:43 PM IST
Rachakonda She Teams Nab 108 Harassers
X

Hyderabad: పోకిరిల ఆట కట్టించిన షీటీమ్స్‌.. 15 రోజుల్లో 108 మంది జైలుకి..

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో షీటిమ్స్‌ పోకిరిల ఆట కట్టించింది. మహిళలను వేధిస్తే కటిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. 15 రోజుల్లో 108 మంది ఆకతాయిలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 108 మందిని (మేజర్స్-67 , మైనర్స్ -41) షీ టీమ్స్ అరెస్టు చేశారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story