Top
logo

Rachakonda Police: కరోనా కష్టకాలంలో రాచకొండ పోలీసుల దాతృత్వం

Rachakonda Police Conduct Blood Donation Camp
X

రక్తదానం చేస్తున్న పోలీసులు (ఫొటో ట్విట్టర్)

Highlights

Rachakonda Police: కరోనా కష్టకాలంలో బ్లడ్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి.

Rachakonda Police: కరోనా కష్టకాలంలో బ్లడ్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి. కరోనా భయంతో రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.. దీంతో రక్త నిల్వలు లేక తలసేమియా సహా అత్యవసర చికిత్సలకు బ్లడ్ అందుబాటులో ఉండట్లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాచకొండ పోలీసులు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుల ఏర్పాటు ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నారు.

దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ బ్లడ్ కొరత వేధిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులు మూడు నెలలు రక్తదానం చేయకూడని పరిస్థితుల్లో తలసేమియా సహా ఎమర్జెన్సీ చికిత్సలకు రక్తం అందుబాటులో లేకుండా పోతోంది. బ్లడ్ కొరత తీవ్రంగా వేధిస్తున్న ఇలాంటి సమయంలో రాచకొండ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.

అత్యవసర పరిస్థితుల నేపధ్యంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ బ్లడ్ డొనేషన్ క్యాప్‌ల నిర్వహణకు పూనుకున్నారు. ఎప్పుడూ విధుల్లో బిజీబిజీగా ఉండే పోలీసులు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 850 యూనిట్ల రక్తం సేకరించారు. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో రక్తం అవసరమైనా రాచకొండ కమిషనరేట్‌ను సంప్రదిస్తే సమయానికి రక్తం అందేలా చర్యలు తీసుకున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ముందుకొచ్చి అండగా నిలుస్తున్న రాచకొండ పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Web TitleRachakonda Police Conduct Blood Donation Camp
Next Story