Top
logo

చెడ్డీగ్యాంగ్ చిక్కింది

చెడ్డీగ్యాంగ్ చిక్కిందిచెడ్డీగ్యాంగ్
Highlights

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతం వాసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీగ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు....

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతం వాసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీగ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల వ్యవధిలో సుమారు ఈ ముఠా ఆరు దోపిడీలకు పాల్పడింది. నిందితుల నుంచి 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చెడ్డీ గ్యాంగ్‌లోని ఏడుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ గ్యాంగ్‌ పగటిపూట బొమ్మలు అమ్ముకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దోపిడీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి 150 గ్రాముల బంగారం, రూ.3వేలు నగదు,నాలుగు వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అకోలాలో నివాసం ఉంటున్న వీరిని టెక్నికల్‌ ఆధారాలతో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Web TitleRachakonda Police Arrested Cheddi Gang
Next Story

లైవ్ టీవి


Share it