Hyderabad: చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Hyderabad: డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇంఛార్జ్ ఇన్సిపెక్టర్ గా బాధ్యతలు

Shekhar G
Published on: 23 Jan 2024 11:27 AM IST
Rachakonda Cp Sudheer Babu Suspends Chaitanyapuri Ps Inspector Nagarjuna
X

Hyderabad: చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు 

Hyderabad: విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఠాణాలో కోర్ట్ వారెంట్లు అమలు చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు... లంచం డిమాండ్‌లో ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడి నుంచి 3 లక్షలు లంచం వసూలు చేశారు. దఫాల వారిగా తీసుకున్నారు. ఇదంతా కొన్ని రోజులుగా సాగుతున్నా.. కనిపెట్టడంలో... సీఐ విఫలమైనట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనికితోడు.. స్టేషన్లో పనిచేసే ఇద్దరు ఎస్సైలు స్టేషన్లోనే గొడవపడగా.. వారిపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించినట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. తదితర కారణాలతో ఇన్స్‌పెక్టర్‌‌పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story