CP Mahesh Bhagwat: షీ టీమ్ స్కూటీలను, అంబులెన్స్‌ను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

CP Mahesh Bhagwat: మహిళల భద్రత కోసం షీ టీంలు 2016 నుంచి పని చేస్తున్నాయి: సీపీ

Sandeep Eggoju
Published on: 20 May 2021 4:34 PM IST
Rachakonda  CP Mahesh Bhagwat Launched She Team Scootys and Ambulance
X

షీ టీమ్ స్కూటీలను, అంబులెన్స్‌ను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్

CP Mahesh Bhagwat: రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 షీ టీమ్స్ స్కూటీలను, ఒక అంబులెన్స్‌ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం షీ టీంలు 2016 నుంచి పనిచేస్తున్నాయని సీపీ అన్నారు. షీ టీమ్స్ పనులను వేగవంతం చేసేందుకు 16 యాక్టివ్ బండ్లను ఓపెన్ చేసినట్టు తెలిపారు.

ఈ సేవలతో మహిళకు మరింత దగ్గర అవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంబులెన్స్ వినియోగం పెరిగిందని.. అందుకే తమ దగ్గర ఉన్న పాత వెహికిల్ ను రిపేర్ చేసిన కొవిడ్ సేవల కోసం వినియోగించవచ్చని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసినట్టు సీపీ తెలిపారు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే బండి సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story