సోషల్ మీడియాలో వైరల్‎గా వన్ రూపీ లిక్కర్ ఆఫర్

సోషల్ మీడియాలో వైరల్‎గా వన్ రూపీ లిక్కర్ ఆఫర్
x
Highlights

అభిమానం ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తమ అభిమాన నటుడు, నాయకుడి పుట్టిన రోజైనా, పెళ్లిరోజైనా సెలబ్రేషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉండాలనుకుంటారు...

అభిమానం ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తమ అభిమాన నటుడు, నాయకుడి పుట్టిన రోజైనా, పెళ్లిరోజైనా సెలబ్రేషన్ మాత్రం ఓ రేంజ్ లో ఉండాలనుకుంటారు ఫ్యాన్స్. సరిగ్గా గద్వాల జిల్లాకు చెందిన ఓ అభిమాని ఇదే చేశాడు. తన అభిమాన డైరెక్టర్ పెళ్లిరోజున ఒక్కరూపాయికే మద్యం పంపిణీ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ ఐపోయాడు. ఇంతకూ ఎవరా అభిమాని..? ఏమా కథ..?

చింతకుంట విష్ణు అనే వ్యక్తి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు టాలీవుడ్ దర్శకుడు ఎన్. శంకర్ అంటే ఎంతో అభిమానం. నవంబర్ 16న శంకర్ పెళ్లి రోజు కావడంతో ఆయన వెడ్డింగ్ యానివర్సరీని విష్ణు ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడి పెళ్లి రోజును పురస్కరించుకొని అలంపూర్‌లో ఒక్క రూపాయికే మద్యం పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం గంట పాటు మందుబాబులకు క్వార్టర్ బాటిల్స్ పంపిణీ చేశారు.

మరోవైపు రూపాయికే క్వార్టర్ ఇస్తున్న వార్త క్షణాల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది మందుబాబులు ఉరుకులు, పరుగుల మీద షాపు ముందు చేరిపోయారు. ఐతే కేవలం గంట పాటే పంపిణీ చేయడంతో చాలా తక్కువ మందిని మాత్రం అదృష్టం వరించింది. జనాలు ఎగబడతారని తెలిసి ముందుగానే టోకెన్‌లు పంచారు. అనంతరం టోకెన్‌లు చూపించి భౌతిక దూరం పాటిస్తూ క్వార్టర్ లిక్కర్ బాటిల్‌ను పట్టుకెళ్లారు మందుబాబులు. ఇలా 60 మందికి 8 వేల 340 రూపాయల విలువైన మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు విష్ణు.

ఈ వన్ రూపీ లిక్కర్ ఆఫర్‎తో విష్ణు పేరు ఒక్కసారిగా వైరల్ అయింది. ఐతే ప్రచారం కోసం ఇదంతా చేయలేదన్న విష్ణు తెలంగాణ ఉద్యమ సమయంలో శంకర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ఆయనపై అభిమానంతో వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఏది ఏమైనా ఒక్కరూపాయికే క్వార్టర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories