Puvvada Ajay Kumar: బిడ్డా.. అన్నీ ఇంకా ఉన్నాయి... ఆ కేసులెక్కడికీ పోలేదు

Puvvada Ajay Kumar: కేసీఆర్ అండదండలతో.. కేటీఆర్‌ను ఉపయోగించుకొని.. కోట్ల రూపాయలు దోచుకున్నాడు

Jyothi
Published on: 22 May 2023 2:13 PM IST
Puvvada Ajay Kumar Fire On Ponguleti Srinivasa Reddy
X

Puvvada Ajay Kumar: బిడ్డా.. అన్నీ ఇంకా ఉన్నాయి... ఆ కేసులెక్కడికీ పోలేదు

Puvvada Ajay Kumar: ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండా అండతో వేల కోట్లు సంపాదించుకున్నాడని విరుచుకు పడ్డారు. కేసీఆర్ అండదండలతో.. కేటీఆర్‌ను ఉపయోగించుకొని.. కోట్ల రూపాయలు దోచుకున్నాడని పువ్వాడ ఆరోపించారు. ఎన్‌ఎస్‌పీ కెనాల్ పనుల్లో దోపిడీ చేసింది మరిచిపోయావా అన్నారు మంత్రి పువ్వాడ... బిడ్డా.. అన్నీ ఇంకా ఉన్నాయి... ఆ కేసులెక్కడికీ పోలేదని హెచ్చారించారాయన.... డబ్బు మదంతో విర్ర వీగుతున్నాడని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో పొంగులేలి ఓ బచ్చా అని, ఖమ్మం రాజకీయ చరిత్రలో పుట్టిన వాడే పువ్వాడ అని, ఆ పువ్వాడకు పుట్టిన వాడే ఈ పువ్వాడ అజయ్ అని అన్నారాయన.

నీ పక్కన ఉన్న అరాచక శక్తుల గురించి ముందు మాట్లాడాల అంటూనే.. ఖమ్మంలో నాకు దమ్ము ఉందని, ఖమ్మంలో అరాచక శక్తులను అణచివేశానని, రౌడీ షీటర్లను అణిచి వేశానని చెప్పారు. నా మనుషులెవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా అని పొంగులేటికి సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ... నువ్వు ఎంపీగా జిల్లాకు చేసిన మేలు ఏంటో చెప్పగలవా అని ప్రశ్నించారాయన... రా ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము నాకు ఉందన్నారు.. నీ చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు.. మదన్ లాల్‌ని నువ్వు ఓడించలేదా అని, ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story