Oxygen Concentrator: సీఎం కేసీఆర్‌కు 250 ఆక్సిజన్‌ కాన్సంట్రేట్లర్లను అందజేసిన మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumar Donates 250 Oxygen Concentrator
x

Oxygen Concentrator: సీఎం కేసీఆర్‌కు 250 ఆక్సిజన్‌ కాన్సంట్రేట్లర్లను అందజేసిన మంత్రి పువ్వాడ

Highlights

Oxygen Concentrator: సీఎం కేసీఆర్‌కు 250 ఆక్సిజన్‌ కాన్సంట్రేట్లర్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అందజేశారు.

Oxygen Concentrator: సీఎం కేసీఆర్‌కు 250 ఆక్సిజన్‌ కాన్సంట్రేట్లర్లను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అందజేశారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ కు అందించారు. వాటిని ఆవిష్కరించిన సీఎం మంత్రిని అభినందించారు. ఈ ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. అమెరికా నుండి ఈ కొత్త కాన్సన్‌ట్రేటర్లను దిగుమతి చేసే విషయంలో సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories