Harish Rao: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుంది

Public Welfare Is The Objective Of Budgeting
x

Harish Rao: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుంది

Highlights

Harish Rao: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌

Harish Rao: సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ పాలన అందిస్తున్నామని అన్నారు మంత్రి హరీష్‌రావు. కాసేపట్లో 2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామన్న ఆయన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌ ఉంటుందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందనప్పటికీ సొంతకాళ్లపై నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆకాంక్షలను నిలబెట్టే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ పథకాలు, అభివృద్ధిని దేశం మొత్తం ప్రశంసిస్తోందని చెప్పిన హరీష్‌రావు తెలంగాణ బడ్జెట్‌ దేశానికి మోడల్‌గా నిలుస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories