logo
తెలంగాణ

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ జోరు

Public Huge Rush in Jewellery Shops Due to Akshaya Tritiya
X

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ జోరు

Highlights

Akshaya Tritiya 2022: వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ రోజే అక్షయ తృతీయ.

Akshaya Tritiya 2022: వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ రోజే అక్షయ తృతీయ. పురాణాల ప్రకారం ఇదొక పర్వదినం. అక్షయ తృతీయ సందర‌్భంగా బంగారం కొనుగోలు చేస్తే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టుగా విశ్వసిస్తారు. బంగారాన్ని భౌతిక రూపంలో కొని ఇంట్లో అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుందని భావిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని మహిళల విశ్వాసం. హైదరాబాద్ నగరంలోని బంగారు నగల దుకాణాలు కళకలలాడాయి. నగల కొనుగోలు దార్లతో బంగారు దుకాణాలు సందడిగా మారాయి.

గత రెండు సంవత్సరాలుగా అక్షయ తృతీయకు కరోనా మ‌హమ్మారి ఎఫెక్టు పడింది. కరెక్టు గా ఇదే సమయానికి రెండు సార్లు లాక్ డౌన్ విదించడంతో చాలామంది కొనుగోలు చేయలేదు. నగల దుకాణాలకు వ్యాపారాల్లేక వెలవెలబోయాయి. ఈ సారి కరోనా కొంత తగ్గు ముఖం పట్టడంతో బంగారం కొనగోలుదార్లతో షాపులన్నీ కిటకిటలాడాయి. అక్షయ తృతియ తో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండడంతో బంగారం కొనడానికి చాలామంది ఆసక్తిచూపారు.

Web TitlePublic Huge Rush in Jewellery Shops Due to Akshaya Tritiya
Next Story