ఆ సైకోకు ఒంటరి మహిళలే టార్గెట్.. ఆడవాళ్ల ముందు బట్టలు విప్పి... బైక్‌పై పారిపోవడం...

Nalgonda: నల్గొండ జిల్లాలో మహిళలకు నరకం చూపిస్తున్న సైకో...

Shireesha
Published on: 29 March 2022 12:35 PM IST
Psycho Targetting Single Women in Nalgonda Arrested | Breaking News
X

ఆ సైకోకు ఒంటరి మహిళలే టార్గెట్.. ఆడవాళ్ల ముందు బట్టలు విప్పి... బైక్‌పై పారిపోవడం...

Nalgonda: ఆ సైకోకు ఒంటరి మహిళలే టార్గెట్. తెల్లవారు జామున వాకిళ్లు ఊడ్చే సమయంలో ఆడవాళ్ల ముందు బట్టలు లేకుండా కనిపించి భైక్ పై పారిపోవడం వాడి అలవాటు. పలు కాలనీలలో ఒంటరిగా వెళుతున్న మహిళలను చేతులతో తాకి వెళ్లడం, రాత్రి పూట చీకటి పొదల్లో ఉండి అసభ్యంగా ప్రవర్తించడం అతని నైజం. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏడెనిమిది నెలలుగా ఆ సైకో వీరంగం నల్గొండలో జిల్లాలోని మహిళలకు నరకం చూపిస్తుంది.

నల్గొండ జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సైకోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన కురిమిల సతీష్ ప్రైవేట్ స్కూళ్లలో టీచర్‌గా పని చేసాడు. తన నుంచి భార్య సపరేట్ అవ్వడంతో ఇలాంటి సైకో చేష్టలు మరింత ఎక్కువ అయ్యాయని పోలీసులు తెలిపారు.

ఈ సందర్బంగా ఎవరైనా ఆకతాయులు, సైకోలు మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఆకతాయిలపై నిరంతరం షీ టీమ్ బృందాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Shireesha

Shireesha

Next Story