Ration Cards: చౌటుప్పల్‌లో రేషన్‌కార్డుల పంపిణీలో గందరగోళం

Ration Cards: ఒకే వేదికపై మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి * ప్రొటోకాల్‌ పాటించడం లేదని కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన

Sandeep Eggoju
Updated on: 26 July 2021 7:01 PM IST
Protocol Issue Between Minister Jagadish Reddy and MLA Raja Gopal
X
మంత్రి జగదీష్ రెడ్డి మరియు రాజా గోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం

Ration Cards: చౌటుప్పల్‌లో రేషన్‌కార్డుల పంపిణీ రసాభాసాగా మారింది. ఒకే వేదికపై మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఎదుట ఇరుపార్టీల కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీష్‌ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి నిలదీశారు. పథకాలు కాదు.. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి సూచనలు చేశారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌తో కొట్లాడి నిధులు తీసుకురావాలని.. లేకపోతే ఎక్కడ సభలు పెట్టినా ఇంతేనని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్న టీఆర్ఎస్‌కి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు రాజగోపాల్‌ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story