కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస

Komaram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస జరిగంది.

Arun Chilukuri
Published on: 20 Nov 2021 3:45 PM IST
Protest in liquor Tenders in Asifabad District
X

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస

Komaram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రసాభాస జరిగంది. సిర్పూర్ యూ, లింగాపూర్ మద్యం షాపుల టెండర్లకు రెండేసీ దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు కన్నా తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల టెండర్లను రీకాల్ చేయాలనే నిబంధన ఉన్నందున రెండు దుకాణాలకు టెండర్లు రీకాల్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టెండర్ సభ్యులు ఆందోళనకు దిగారు. లక్కీ డ్రా తీయాలంటూ అబ్కారీ శాఖ అధికారులముందు పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు.

పోలీసులు సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లక్కీ డ్రా తీయాలంటూ పట్టుబట్టారు. వెళ్లిపోతున్నా క్రమంలో జిల్లా కలెక్టర్ వాహనంను అడ్డుకున్నారు. ఇది పూర్తిగా ఆబ్కారీ అధికారుల తప్పిదమని, తమకు 5కన్నా తక్కువ దరఖాస్తులు వస్తే ముందే చెప్పకుండా లక్కీడ్రా ముగిసే సమయానికి చెప్పారని, ఇది సబబు కాదన్నారు. ఎట్టి పరిస్థితులలో లక్కీ డ్రా తీయాలని పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story