Hyderabad: మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం
Hyderabad: ప్రొటోకాల్ పాటించడంలేదంటూ నిరసన
Hyderabad: మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం
Hyderabad: మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. అయితే.. ఎమ్మెల్యే లేకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దీనిపై స్పందించిన మేయర్.. ఆయనతో నాకేం సంబంధమని ఎదురు సమాధానం ఇచ్చారు. దీంతో మేయర్ విజయలక్ష్మిని అడ్డుకున్న బీఆర్‌ఎస్ నేతలు.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ పాటించడంలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేస్తూ.. ఆగ్రహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. మేయర్ తీరును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Next Story




