తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం !
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం సంచలన నిర్ణయం...

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం సంచలన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్‌ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు సీనియర్‌ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Show Full Article
Print Article
Next Story
More Stories