సరూర్‎నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రాపర్టీ ఎక్స్‎పో

* ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‎రెడ్డి

R Tripura Malini
Published on: 3 Dec 2022 5:16 PM IST
Property Expo At Sarurnagar Indoor Stadium
X

సరూర్‎నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రాపర్టీ ఎక్స్‎పో

Saroornagar: అభివృద్దిలో హైదరాబాద్ దేశంలోనే ఐకాన్ లా మారిందన్నారు మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ అంటే ఒక చరిత్ర అని గుర్తు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఈస్ట్ జోన్‎లో మునుపెన్నడూ ఊహించని రీతిలో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్‎లోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జరిగే ప్రాపర్టీ ఎక్స్ పో‎ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‎రెడ్డితో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతోందన్నారు. ఫ్లై ఓవర్లు, నీటి వ్యవస్థే కాదు అన్ని రకాలుగా పెట్టుబడులకు అనువైందని గుర్తు చేశారు. ముఖ్యంగా బిల్డర్స్ కు దిక్సుచి హైదరాబాద్ నగరమన్నారు. ఐటి రంగంలో బెంగళూర్ కంటే ఎక్కువ ప్రాధాన్యతను పొందిన నగరం హైదరాబాద్ అని మంత్తరి గుర్తు చేశారు. పెద్దపెద్ద పరిశ్రమలు, ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. విశ్వనగరంలో మరింత క్వాలిటితో కూడిన బిల్డింగ్‎లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి.

R Tripura Malini

R Tripura Malini

Next Story