Priyanka Gandhi: సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నా.. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం

Priyanka Gandhi: జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

Dhatripriya
Published on: 9 May 2023 7:53 AM IST
Priyanka Gandhi Speech At Telangana Congress Yuva Sangharshana Sabha
X

Priyanka Gandhi: సోనియమ్మ బిడ్డగా మాటిస్తున్నా.. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం

Priyanka Gandhi: అధికారం కోల్పోతామని తెలిసినా... తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సాహసంచేశారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. జైబోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంకా గాంధీ యువతను ఉత్సాహ పరిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలకోసం నిరుద్యోగ యువత ప్రాణత్యాగం చేసిన తీరును గుర్తుకుతెచ్చారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం యువత ఉద్యమిస్తే... అవేవీ ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువసంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రియాంకా గాంధీ జనాన్ని ఉద్దేశించి ఉత్సాహపూరితంగా మాట్లాడారు. సభకు వేలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తంచేశారు. సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story