లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay: లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ హాజరయ్యారు.

Arun Chilukuri
Published on: 21 Jan 2022 5:24 PM IST
Privilege Panel Take up Bandi Sanjay Arrest Matter
X

లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay: లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ హాజరయ్యారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ సహా బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని ఆయన కోరారు. తన కార్యాలయంపై పోలీసుల దాడిని, అరెస్టును హైకోర్టు కూడా తప్పు పట్టిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

కరీంనగర్‌ సీపీ సహా పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారి అన్న బండి సంజయ్‌ గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా 2019 అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని తనపై దాడి చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో వల్ల ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి వివరించారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story