నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
*పది మందికి గాయాలు... ఆసుపత్రికి తరలింపు
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
Road Accident: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి ఒంగోలు జిల్లా కందుకూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




