Nizamabad: లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

Road Accident: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని పెర్కిట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 17 Feb 2023 10:50 AM IST
Private Travel Bus Hits Lorry at Armoor
X

Nizamabad: లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

Road Accident: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని పెర్కిట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. క్షతగాత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌ బాబు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story