తెలంగాణలో ఆగని ప్రైవేట్ హాస్పిటల్స్ దందా

తెలంగాణలో ఆగని ప్రైవేట్ హాస్పిటల్స్ దందా
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Private hospitals: కరోనా ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. కరోనా భయాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా...

Private hospitals: కరోనా ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయి. కరోనా భయాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని వీటిని కట్టడి చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ హాస్పటల్స్ దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి దోపిడిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్

కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కనీసం మానవత్వం చూపడం లేదు. కరోనా ట్రీట్మెంట్ కోసం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడికి ఇప్పటికే 1,039 ఫిర్యాదులు అందాయని అందులో అధిక బిల్స్ కు సంబంధించి 130 ఫిర్యాదులు అందినట్లు అధికారులు చెప్తున్నారు.

గత నెలలో కోవిడ్ పాజిటివ్ తో ఒక కుటుంబం బంజారాహిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. వారి రోగాన్ని ఆ కార్పొరేట్ ఆస్పత్రి ఆసరాగా చేసుకుంది. కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రి వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నారు. ఒక్కొక్కరికి లక్షా నలభై వేలు డిపాజిట్ చేసుకుని జాయిన్ చేసుకున్నారు. అయితే సాయంత్రం జాయిన్ చేసుకుంటే ఉదయం నుండే బిల్లు వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

పేషెంట్లకు ట్రీట్మెంట్ లు అందించడం కోసం అక్కడి స్టాఫ్ రోజుకు 27 పీపీఈ కిట్లను వాడినట్టు చూపారు. ఒక్కో కిట్టు కోసం 920 రూపాయల బిల్లు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పేషెంట్‌ ఉన్న రూంలో ఒకసారి శానిటైజ్ చేసి మూడు సార్లు చేసినట్టుగా చూపించారు. దానికి ఒక్కోసారి 2,500 చొప్పున, రోజుకు 7500 రూపాయల బిల్లు వేశారు. ఇక ఇవే కాకుండా బయో డిస్పోజబుల్ వేస్టేజ్ పేరుతో ప్రతీరోజూ 2,030 వసూలు చేశారు. ఇక సోషల్ డిస్టన్స్ సెక్యూరిటీ పేరుతో రోజుకు 2,140 రూపాయలు వసూలు చేశారు. లాండ్రి కోసం 2,440 రూపాయలు ప్రతీ రోజూ వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 13 లక్షల వరకు బిల్లు వేశారని ఇందులో 9 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చారని మిగతావి ఇవ్వమని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలకు, దోపిడికి అడ్డు కట్ట వేయాలని బాధితులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories