ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ హాస్పిటళ్ల దోపిడీ

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ హాస్పిటళ్ల దోపిడీ
x
Highlights

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతలో ఉండి కొందరు వైద్యులే పేదల రక్తం పీల్చేస్తున్నారు. అసలే అనారోగ్య కష్టాలతో వచ్చే రోగుల దగ్గర విచ్చలవిడిగా దోపిడీ...

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతలో ఉండి కొందరు వైద్యులే పేదల రక్తం పీల్చేస్తున్నారు. అసలే అనారోగ్య కష్టాలతో వచ్చే రోగుల దగ్గర విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ జేబులు గుళ్ల చేస్తున్నారు. ఆర్‌ఎంపీలతో వాటాలు మాట్లాడుకుని మరీ పేషంట్లను లూటీ చేస్తున్నాయి ప్రైవేట్‌ హాస్పిటళ్లు. ఇలా టెస్టుల దగ్గర నుంచి ఆపరేషన్ల దాకా డబ్బులు పిండేయటమే లక్ష‌్యంగా వ్యవహరిస్తున్న ఉమ్మడి ఆదిలాబా‌ద్ ఆసుపత్రుల దోపిడీపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. కరోనాతో సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో రోగాల బారిన పడిన వారికి భరోసా ఇవ్వాల్సిన వైద్యులు బరితెగించి దోపిడీకి పాల్పడుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత టెస్టుల నుండి ఆపరేషన్ల దాకా ధరలు అమాంతం పెంచిన ప్రైవేట్ హాస్పిటళ్లు స్పెషలిస్ట్ డాక్టర్ల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు తెరతీశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌ అయితే డబ్బులు దండుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆర్‌ఎంపీలతో దళారీ వ్యవస్థకు తెరలేపాయి. పేషంట్‌ను పంపిస్తే ఇంత టెస్టుకు ఇంత అంటూ వాటాలు మాట్లాడుకుని మరీ దోపిడీకి పాల్పడుతోంది. ఇక సిజేరియన్, అపైండీసైటీస్, చిన్నపాటి సర్జరీలు, కంటి అపరేన్లకు ఫీజులు యాబై వేలు మించుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్‌లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేషంట్లు. ఒక్క నిర్మల్‌లోనే కాదు ఉమ్మడి జిల్లా మొత్తం ఇలా హాస్పిటళ్ల దోపిడీ రాజ్యం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories