Hyderabad: ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం.. గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!

Hyderabad: గర్భిణీని పట్టించుకోకపోవడంతో శిశివు మృతి

Rama Rao
Updated on: 27 Jun 2022 4:41 PM IST
Private Hospital Negligence in Chaderghat | Hyderabad News
X

Hyderabad: ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం.. గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!

Hyderabad: హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలోని ఓ ఆస్పత్రికి చెందిన వైద్యుల నిర్లక్ష్యానికి శిశివు చనిపోయింది. వైద్యులు, వైద్య సిబ్బంది పార్టీలో నిమగ్నమై శిశువు మృతికి కారణమయ్యారని బంధువులుఆరోపిస్తున్నారు. వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండడంతో ఆస్పత్రి బిల్డింగ్‌ పై పార్టీ ఏర్పాటు చేశాడు. డీజీ సాంగ్ లు పెట్టుకొన చిందులేశారు.

అదే సమయంలో ఓ గర్బిణీ వైద్యం కోసం అదే ఆస్పత్రికి వచ్చింది. కానీ వైద్యులంతా పార్టీలో ఫుల బిజీగా ఉండిపోయారు. బాధిత కుటుంబసభ్యులు ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు.చివరకు జరగరాని ఘోరం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందక శిశివు చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Rama Rao

Rama Rao

Next Story