చంచల్‌గూడ జైల్లో ఖైదీ వీరంగం.. గంజాయి మత్తులో సాహా అనే రిమాండ్‌ ఖైదీపై దాడి

Chanchalguda Jail: ఫొటోలు తీసిన విషయం గుర్తించి సాహా తండ్రిపై ఎస్కార్ట్‌ సిబ్బంది దాడి

Shekhar G
Published on: 18 July 2023 6:46 PM IST
Prisoner Attacked In Chanchalguda Central Jail
X

చంచల్‌గూడ జైల్లో ఖైదీ వీరంగం.. గంజాయి మత్తులో సాహా అనే రిమాండ్‌ ఖైదీపై దాడి

Chanchalguda Jail: హైదరాబాద్‌ చంచల్‌గూడ జైల్లో ఓ ఖైదీ వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో సాహా అనే రిమాండ్‌ ఖైదీపై మరో ఖైదీ సాయికిరణ్‌ దాడి చేశాడు. గత నెల 14న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో గతవారం ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన సాహాను.. తన తండ్రి ఫొటో తీయడంతో దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. ఫొటోలు తీసిన విషయం గుర్తించిన ఎస్కార్ట్‌ సిబ్బంది.. సాహా తండ్రిపైనా దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

సాహా కుడిచేయి పూర్తిగా విరిగిందని తండ్రి నితిన్‌ సాహా చెబుతున్నారు. ములాఖత్‌ ద్వారా సాహాను తండ్రి నితిన్‌ సాహా కలిశారు. అయితే.. ఖైదీలు, సూపరింటెండెంట్‌ తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సాహా తన తండ్రికి చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై లాయర్‌ రామారావు.. హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయగా.. జైలులో మానవ హక్కుల ఉల్లంఘన, జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని సాహా తండ్రి నితిన్‌ సాహా డిమాండ్‌ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story