Narendra Modi: ఈనెల 30న మహబూబ్‌నగర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ

Narendra Modi: త్వరలోనే అమిత్ షా, నడ్డా సభలకూ బీజేపీ ప్లాన్‌

Shekhar G
Published on: 23 Sept 2023 4:07 PM IST
Prime Minister Narendra Modi Will Visit Mahabubnagar On 30th Of This Month
X

Narendra Modi: ఈనెల 30న మహబూబ్‌నగర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ

Narendra Modi: త్వరలోనే తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల శం‌ఖారావం పూరించనున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ దూకుడు పెంచుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో మరింత స్పీడ్ పెంచి పర్యటనలు ముమ్మరం చేసే ప్లాన్‌ చేస్తోంది టీబీజేపీ. ఈనెల 30న ప్రధాని పర్యటనతో ఎన్నికల శంఖారావం పూరించనుండగా.. అక్టోబర్‌ నుండి జాతీయ నేతలు కూడా పర్యటనకు రానున్నారు. ప్రధాని సభ అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ బీజేపీ.

Shekhar G

Shekhar G

Next Story