logo
తెలంగాణ

Narendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు

Prime Minister Narendra Modi Started his Speech in Telugu | TS News Today
X

Narendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు

Highlights

Narendra Modi: కుటుంబ పాలనను ప్రోత్సహించే వాళ్లు, ఆ పార్టీలే దేశానికి ద్రోహులు

Narendra Modi: వచ్చీ రాగానే ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోడీ స్వాగత సభ సాక్షిగా తెలుగులో ప్రసంగించారు. తెలంగాణ గడ్డ పట్టుదల, పౌరుషాలకు మారుపేరన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాల్లో పట్టుదల, పౌరుషం కన్పించిందన్నారు. వారందరికి తాను నమస్కరించి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. మోడీ చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలే అంటూ కొందరు నేతలు చెప్తున్నారు.

కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని అలాంటి పాలన పోవాలని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనమందరం పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణను టెక్నాలజీకి హబ్‌గా మార్చుదామని అనుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.


Web TitlePrime Minister Narendra Modi Started his Speech in Telugu | TS News Today
Next Story