బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలకు ముస్తాబైన భాగ్యనగరం

Prime Minister Modi Will Stay at Novotel Hotel
x

బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలకు ముస్తాబైన భాగ్యనగరం

Highlights

PM Modi: నోవాటెల్ హోటల్లో బసచేయనున్న ప్రధాని మోడీ

PM Modi: బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. భాగ్యనగరం సర్వహంగులతో ముస్తాబైంది. ప్రధాని మోడీ వస్తుండటంతో సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాని మోడీ ‎ఈరోజు హైదరాబాద్ చేరుకుంటారు.. తొలుత రాజ్ భవన్ లో బసచేస్తారని ఖరారైనప్పటికీ.. భద్రతా కారణాలతో నోవాటెల్ లోనే బస చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దీంతో కేంద్ర భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మోడీ రాక సందర్భంగా వ్యతిరేక నినాదాలతో ఫ్లెక్సీలు వెలవడంతో పోలీసు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. మోడీ పర్యటించే ప్రాంతాల్లో సమావేశాలకు రెండు రోజు ముందు నుంచే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ప్రధాని పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తెచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories