PM Modi: రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: మ.3:45 నుంచి సా. 4.45 వరకు బహిరంగసభలో పాల్గొననున్న ప్రధాని

Shekhar G
Updated on: 2 Oct 2023 5:46 PM IST
Prime Minister Modi Is Coming To Telangana Again Tomorrow
X

PM Modi: రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ షెడ్యూల్‌ను ప్రకారం మధ్యాహ్నాం 2గంటల 10 నిమిషాలకు బీదర్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. 2గంటల 55 నిమిషాలకు బీదర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ప్రధాని మోడీ నిజామాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3గంటల 35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3గంటల 45 నిమిషాల నుంచి 4గంటల 45 నిమిషాల వరకు ప్రధాని మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు.

Shekhar G

Shekhar G

Next Story