కరోనా ఉన్నా పురుడు పోశారు.. అభినందించిన మంత్రి కేటీఆర్..

Primary Health Centre: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా గర్బిణీకి పురుడు పోసిన వైద్యులను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

Arun Chilukuri
Updated on: 27 Jan 2022 9:31 PM IST
Primary Health Centre in Rajanna Sircilla Successfully Delivered a Covid-19 Positive Pregnant Woman
X

కరోనా ఉన్నా పురుడు పోశారు.. అభినందించిన మంత్రి కేటీఆర్..

Primary Health Centre: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా గర్బిణీకి పురుడు పోసిన వైద్యులను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. వీర్ణపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన లకావత్‌ రజిత అనే గర్భిణీకి కరోనా సోకింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఎల్లారెడ్డిపేట్‌ మండల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకువచ్చారు. రజితను జిల్లా ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో ఆరోగ్య కేంద్రం సిబ్బంది పురుడు పోశారు. మగబిడ్డకు జన్మనించిన రజితను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి పంపించారు. కరోనా సోకిన గర్బిణీకి పురుడు పోసిన వైద్యులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story