Medak: పెళ్లిలో మంగళసూత్రం దొంగలించిన పురోహితుడు

Priest Theft Birdes Nupital Chain in a Marriage in Medak District
x

Medak: పెళ్లిలో మంగళసూత్రం దొంగలించిన పురోహితుడు

Highlights

edak: మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం పడాల పల్లి గ్రామంలో ఓ బ్రహ్మణుడు చేతివాటం ప్రదర్శించాడు.

Medak: మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం పడాల పల్లి గ్రామంలో ఓ బ్రహ్మణుడు చేతివాటం ప్రదర్శించాడు. పెళ్లి జరిపించాల్సిన పంతులే మంగళసూత్రం దొంగిలించాడు. అంతేకాదు.. తాళి కట్టించకుండా దండలు మార్పించి వివాహం జరిపించాడు. అయితే పెళ్లి వీడియోలో పంతులు దొంగతనం బట్టబయలైంది. మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్నట్లుగా అందులో స్పష్టంగా రికార్డయింది.

దీంతో ఆ దొంగ పురోహితుడి కోసం వధూవరుల బంధువులు రెండు రోజులుగా వెతకడం మొదలుపెట్టారు. అయితే, ఈ వ్యవహారం తెలిసిన సదరు పూజారి ఫోన్ స్విచాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో అతని ఇంటికెళ్లి అడిగితే తనకేమీ తెలియదని ఆయన భార్య సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీంతో బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియోను చూసి పురోహితుడి కోసం గాలిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories