Droupadi Murmu: నేటితో ముగియనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది

Droupadi Murmu: నేటితో ముగియనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది
x

Droupadi Murmu: నేటితో ముగియనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది

Highlights

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది నేటితో ముగియనుంది.

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది నేటితో ముగియనుంది. ఈ నెల 17న హైదరాబాద్ చేరుకున్న ఆమె, సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన సంగతి తెలిసిందే. విడిదిలో భాగంగా గత ఐదు రోజులుగా ఆమె నగరంలో జరిగిన పలు అధికారిక, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

తన ఐదు రోజుల బసను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. హకీంపేట వాయుసేన విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆమె బయలుదేరనున్నారు.

రాష్ట్రపతి వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గడిచిన ఐదు రోజులుగా నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories