Droupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 3:07 PM IST
Droupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
X

Droupadi Murmu: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట వాయుసేన విమానాశ్రయంలో దిగిన ఆమెకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే బస చేసి, నగరంలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story