Droupadi Murmu: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి

Droupadi Murmu: పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

Jyothi
Updated on: 30 Dec 2022 1:23 PM IST
President Draupadi Murmu Visits Yadadri Temple
X

Droupadi Murmu: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రిలో పర్యటించారు. ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి గవర్నర్‌ తమిళిసైతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్రమంత్రులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story