TET Exam: టెట్‌ పరీక్షలో విషాదం.. ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణి మృతి..!

TET Exam: టెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది.

Arun Chilukuri
Updated on: 15 Sept 2023 1:39 PM IST
Pregnant Woman Dies at TET Exam Centre
X

TET Exam: టెట్‌ పరీక్షలో విషాదం.. ఎగ్జామ్‌ సెంటర్‌లో గర్భిణి మృతి..!

TET Exam: పటాన్‌చెరులోని టెట్ ఎగ్జామ్‌ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. టీచర్ ఎలిజిబుల్ టెస్ట్.. రాసేందుకు వచ్చి 8నెలల గర్భిణీ రాధిక కన్నుమూసింది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. లేట్ అవుతుందనే టెన్షన్‌తో పరీక్షా గదికి త్వరగా చేరుకునే క్రమంలో రాధికకు బీపీ ఎక్కువైంది. చెమటలొచ్చి పరీక్షా గదిలోనే కుప్పకూలిపోయింది రాధిక. వెంటనే ఆమెను భర్త అరుణ్ పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు వైద్యులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story