అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

* స్వగ్రామం గిర్నితండాలో ప్రీతి అంత్యక్రియలు

Dhatripriya
Published on: 27 Feb 2023 1:12 PM IST
Preeti Last Rites And Tears
X

అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

Preeti: అశ్రునయనాల మధ్య మెడికో విద్యార్థి ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం జనగామ జిల్లా గిర్నితండాలో ప్రీతి అంత్యక్రియలు నిర్వహించారు. కన్నీటితో కుటుంబసభ్యులు, గ్రామస్తులు వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు స్థానిక నేతలు, విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యయత్నం చేసిన మెడికో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం రాత్రి ప్రీతి మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వగ్రామం గిర్ని తండాకు తరలించారు. ఆమెను చూసిన బంధువులు, ప్రజల గుండెలు రోదించాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రీతిని చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story