వరంగల్‌ పోలీసులకు అందిన ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్.. రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ..

Preeti Case Forensic Report Reached to Warangal Police
x

వరంగల్‌ పోలీసులకు అందిన ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్.. రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ..

Highlights

Preeti Case: మెడికో ప్రీతి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్టులు పోలీసుల చేతికి అందాయి.

Preeti Case: మెడికో ప్రీతి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్‌ రిపోర్టులు పోలీసుల చేతికి అందాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రీతికి చేసిన పోస్టుమార్టం ఆధారంగా ఫోరెన్సిక్ అధికారులు రిపోర్టు రెడీ చేసి వరంగల్‌ పోలీసులకు అందించారు. ఈ రిపోర్టులతో ప్రీతి మరణంపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడనుండగా.. నివేదికలో ఏముందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బ్లడ్‌ శాంపిల్స్‌ రిపోర్టు కూడా పోలీసులకు అందినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రీతి కేసులో కస్టడీలో ఉన్న సైఫ్‌ను విచారిస్తున్నారు పోలీసులు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మట్టెవాడ పోలీసు స్టేషన్ లో ఏసీపీ కిషోర్‌ విచారణ జరపగా.. సాయంత్రం హెడ్ క్వార్టర్స్‌లో కమిషనర్‌ పర్యవేక్షణలో విచారణ జరిగింది. ఏ సమయంలో ఆస్పత్రిలో కలిసి డ్యూటీ చేశారు అనే కోణంలో ప్రశ్నించారు. సైఫ్ చెప్పిన విధంగా డ్యూటీ లిస్టులను పరిశీలించారు. అయితే సీనియర్‌ను కాబట్టి తనకు భయపడాలని ప్రీతితో అన్నాను తప్ప వేధించలేదని సైఫ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories